: నాదెండ్ల మనోహర్ హౌస్ అరెస్ట్... తెనాలి, విజయవాడల్లో ఉద్రిక్తత!


విజయవాడలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో తెనాలి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం లేదని, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ధర్నా చేపట్టిన నేపథ్యంలో విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల విజయవాడకు బయలుదేరగా, పోలీసులు అడ్డుకుని ఇల్లు కదలనివ్వలేదు. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, నాదెండ్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. పోలీసుల వైఖరిని నాదెండ్ల తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News