: థాయ్ ల్యాండ్ హాస్టల్ లో ఘోరం... 17 మంది అమ్మాయిల సజీవదహనం
థాయ్ ల్యాండ్ రాజధాని నగరం బ్యాంకాక్ లో ఘోర అగ్నిప్రమాదం జరుగగా, 17 మంది బాలికలు మరణించారు. ఆర్థికంగా పేదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబాల్లోని బాలికల కోసం ఏర్పాటు చేసిన స్కూల్ హాస్టల్ లో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లో చుట్టుముట్టిన మంటల బారి నుంచి బయటపడలేక 17 మంది సజీవదహనం కాగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటన అనంతరం కొంతమంది అమ్మాయిల ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నామని, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నామని వెల్లడించారు.