: మణిపూర్ లో చెలరేగిపోయిన ఉగ్రవాదులు... ఆరుగురు జవాన్ల బలి


మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. చందేల్ జిల్లాలో భారత్, మయన్మార్ సరిహద్దుల్లో సాయుధులైన ఉగ్రవాదులు అస్సామ్ రైఫిల్స్ కాన్వాయ్ ను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దాడిలో కమిషన్డ్ ఆఫీసర్ తోపాటు ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఆదివారం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని సందర్శించి తిరిగి వెళుతుండగా... మధ్యాహ్నం 1 గంట సమయంలో మోల్చమ్ పోలీస్ ష్టేషన్ పరిధిలోని జోపి హెంగ్షి ప్రాంతంలో ఉగ్రవాదులు దారి కాచి దాడికి పాల్పడ్డారు. రెండు నుంచి మూడు ఉగ్రవాద గ్రూపులు కలసికట్టుగా ఈ దాడి చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడి అనంతరం పెద్ద సంఖ్యలో అదనపు బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

  • Loading...

More Telugu News