: నెహ్రూ జూపార్క్ లో సింహాల బోనులోకి దూకిన యువకుడు
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో ఓ యువకుడు సాహసానికి ఒడిగట్టాడు. సింహాలతో తలపడాలనుకున్నాడేమో... ధైర్యంగా సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకిన ముఖేష్ అనే యువకుడు వాటి వైపు అడుగులు వేస్తుండగా.... క్యూరేటర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడ్ని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. ముఖేష్ అనే ఈ యువకుడు ఎల్ ఎండ్ టీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు విచారణలో తేలింది.