: రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఆగస్టు 1న విచారణ కమిషన్ నివేదిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించిన నివేదికను విచారణ కమిషన్ ఆగస్టు 1వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా రాజకీయ అలజడి సృష్టించడంతోపాటు విశ్వవిద్యాలయాల్లో వివక్షపై దేశవ్యాప్త ఉద్యమానికి బీజం వేసిన సంగతి తెలిసిందే. వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలపై విచారణకు అప్పట్లోనే కేంద్రం మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాల్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర వర్గాల వారితో మాట్లాడి.. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ఆగస్టు 1న నివేదిక ఇవ్వనుంది.