: దావూద్ నుంచి నాకు ఎలాంటి కాల్స్ రాలేదు: బీజేపీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ కు తరచూ ఫోన్ కాల్స్ చేసే జాబితాలో బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే నంబర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ స్పందించారు. ఆ జాబితాలో ఉన్న ఫోన్ నంబర్ తనదేనని, అయితే, తనకు మాత్రం దావూద్ నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారికి దావూద్ ఇబ్రహీం నంబర్ ఎలా తెలిసిందో చెప్పాలని, ఆ ఫోన్ నంబరు దావూద్ ది అని తెలిసినప్పుడు వారు పోలీసులకు ఎందుకు చెప్పలేదని ఏక్ నాథ్ ప్రశ్నించారు. గత ఏడాదిగా తనకు ఎటువంటి విదేశీ ఫోన్ కాల్స్ రావడం లేదా తాను ఫోన్ చేయడం గానీ జరగలేదని ఏక్ నాథ్ ఖడ్సే పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News