: నాకు ఇంకో ఊర్మిళ దొరికినప్పుడు రంగీలా లాంటి సినిమా తీస్తా!: దర్శకుడు వర్మ


‘నాకు ఇంకో ఊర్మిళ దొరికినప్పుడు ‘రంగీలా’ లాంటి సినిమా మళ్లీ చేస్తాను’ అన్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. హీరోయిన్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకునే సినిమా కథ రాస్తారా? అన్న ప్రశ్నకు.. రొమాంటిక్ సినిమా తీస్తే మాత్రం ఆ విధంగా చేస్తానని అన్నారు. పెర్ఫామెన్స్, గ్లామర్.. ఇలా ఏ అంశాలు చూసి మీ చిత్రాల్లో హీరోయిన్ కు అవకాశమిస్తారని వర్మను అడగగా...‘నా కళ్లకు నచ్చితే చాలు’ అని ఆయన చెప్పారు. అందాల తార శ్రీదేవితో మళ్లీ ఇంకో సినిమా తీసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, భవిష్యత్ లో ఉంటుందేమో చెప్పలేనని అన్నారు. కాగా, వర్మ తాజా చిత్రం హిందీ ‘వీరప్పన్’ ఈ నెల 27 న విడుదల కానున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News