: నేటి అర్ధరాత్రి నుంచి నిరవధికంగా ఆటోల బంద్


స్పెషల్ డ్రైవ్ పేరిట రవాణా, పోలీసు అధికారులు తమను వేధింపుల పాలు చేస్తున్నారంటూ ఆటోసంఘాలు ఆరోపించాయి. సుమారు 15 ఆటో సంఘాలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో నిరవధికంగా ఆటోలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఆటో సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో, గ్రేటర్ హైదరాబాద్ లోని సుమారు లక్షా 30 వేల ఆటోలు నిలిచిపోనున్నాయి. ఆటోల బంద్ తో సుమారు 8 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజు తిరిగే 3,550 బస్సులతో పాటు మరో 150 బస్సులు అదనపు సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట, తదితర రైల్వేస్టేషన్ లు, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ షుక్ నగర్ బస్ స్టేషన్ లతో పాటు రద్దీ అధికంగా ఉండే రూట్లలో అదనపు ఆర్టీసీ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ డైరెక్టర్ పురుషోత్తమ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News