: ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న రవిచంద్రన్ అశ్విన్
ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని దాటిన ఆరో ఆటగాడిగా రైజింగ్ పూణె ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్-9లో భాగంగా ప్రస్తుతం విశాఖపట్నంలో రైజింగ్ పూణె, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు 100 వికెట్లు తీసిన బౌలర్లుగా లసిత్ మలింగా, అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా, బ్రేవో, హర్భజన్ సింగ్ ఉన్నారు. తాజాగా వీరి పక్కన అశ్విన్ కూడా చోటు సంపాదించుకున్నాడు. పంజాబ్ ఆటగాడు మురళీ విజయ్ వికెట్ పడగొట్టడంతో 100వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.