: టీనేజ్ లోనే విష సంస్కృతికి ఆకర్షితులవుతున్న బాలలు... అమెరికా మొత్తాన్ని కుదిపేస్తున్న ఘటన


అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో స్వేచ్ఛ పేరుతో విలువలకు పాతర వేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే అది ప్రపంచానికి షాక్ కలిగించేంత వికృత రూపం దాల్చడంపై అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటన అమెరికాలో కలకలం రేపుతున్నా, పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం? వారికి ఎటువంటి విలువలు నేర్పుతున్నాం? అన్న ప్రశ్నలను లేవనెత్తడం విశేషం. వివరాల్లోకి వెళ్తే...ఫ్లోరిడాలోని సౌత్ ఫోర్ట్ మియర్స్ హై స్కూల్ లో చోటుచేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు మాట్లాడుతూ, స్కూలులో క్లాసులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాల లోపలికి రావడాన్ని సీసీ కెమెరాలో చూశామని అన్నారు. ఆ తరువాత 25 మంది బాలురు ఒకరి తరువాత మరొకరు బాత్ రూం లోపలికి వెళ్లి బయటకు రావడాన్ని గుర్తించామని వారు చెప్పారు. వారంతా లోపలికి వెళ్లిన తర్వాత చేసిన అఘాయిత్యాన్ని కెమెరాలో చిత్రీకరించారని, అది వైరల్ కావడంతో తమకు ఫిర్యాదు వచ్చిందని వారు తెలిపారు. ఈ ఘటనలో పదిహేనేళ్ల ఓ విద్యార్థిని పలువురు బాలురతో కలసి బాత్ రూంలో సెక్స్ చేసినట్టు ప్రిన్సిపాల్ ముందు అంగీకరించిందని వారు తెలిపారు. ఈ ఘటన వెనుక స్కూల్ కు చెందిన ఫుట్ బాల్ ఆటగాళ్ల ప్రమేయముందని వారు నిర్ధారించారు. అయితే ఇంత దారుణమైన ఘటన స్కూల్ లో చోటుచేసుకోవడం దారుణమని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో చిత్రీకరించిన మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News