: తమిళనాట గెలిచిన తెలుగువారు 22 మంది... చెప్పుకునే వారు మాత్రం కరవు!
తమిళనాడుకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 22 మంది తెలుగువారు విజయం సాధించారు. అయితే, తాము తెలుగు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమని చెప్పుకునేందుకు వీరిలో అత్యధికులు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఇక తాజా ఎన్నికల్లో డీఎంకే 20 మంది తెలుగువారికి, అన్నాడీఎంకే 13 మందికి, కాంగ్రెస్ ఇద్దరికి, బీజేపీ ఐదుగురు తెలుగువాళ్లకు టికెట్లు ఇవ్వగా, వారిలో 22 మంది గెలిచారు. వీరిలో తాము తెలుగువాళ్లమని చెప్పేవారు పట్టుమని పది మంది కూడా లేరు. చెన్నై నగర మాజీ మేయర్, చిత్తూరు జిల్లా కుటుంబానికి చెందిన వ్యక్తి సుబ్రహ్మణియన్ చెన్నై పరిధిలోని సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున పోటీ పడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా తెలుగు కుటుంబానికి చెందిన వారేనన్న సంగతి అందరికీ తెలిసిందే.