: ఈదురుగాలులకు సెక్రటేరియట్ లో సింథటిక్ వాటర్ ట్యాంకులు ధ్వంసం
హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా సచివాలయం ఆవరణలో పలు చెట్లు నేలకూలాయి. తెలంగాణ సెక్రటేరియట్ లోని నల్లపోచమ్మ దేవాలయంపై చెట్టు విరిగిపడింది. దీంతో అక్కడి శివుడి విగ్రహం ధ్వంసమైంది. బలంగా వీచిన ఈదురు గాలుల కారణంగా సెక్రటేరియట్ లోని పలు బ్లాకులపై ఉన్న సింథటిక్ వాటర్ ట్యాంకులు కొట్టుకుపోయాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న జహంగీర్ నగర్ లో కూడా సింథటిక్ వాటర్ ట్యాంకులు ఎగిరి పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.