: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స


మొట్టమొదటి సారిగా గుంటూరులోని ప్ర‌భుత్వాసుప‌త్రిలో జరిగిన గుండె మార్పిడి శ‌స్త్ర‌ చికిత్స‌ విజయవంతమైంది. రోడ్డు ప్రమాదం కారణంగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఏడుకొండలు అనే వ్య‌క్తి గుండెను చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి నుంచి జీజీహెచ్‌ కు పోలీసుల సహకారంతో గ్రీన్ చానెల్ ద్వారా కేవ‌లం 14 నిమిషాల్లోనే తరలించారు. వైద్యుడు గోఖలే ఆధ్వ‌ర్యంలో ఈ గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్సను నిర్వహించారు. సుమారు ఆరు గంటలపాటు జరిగిన ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా వైద్యులు పూర్తి చేశారు. గుంటూరు స్వర్ణభారత్‌ నగర్‌ కు చెందిన ఏడుకొండలు అనే యువకుడికి గుండెను అమర్చిన వైద్యులు అంతా సవ్యంగా జరిగిందని ప్రకటించారు. ప్రస్తుతం రోగి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని వారు తెలిపారు. ఈ సందర్భంగా డా.గోఖలే బృందం కృషిని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులు అభినందించారు.

  • Loading...

More Telugu News