: దిశ మార్చుకున్న 'రోను' తుపాను... గోపాల్ పూర్ వైపు పయనం


బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి ఇప్పుడు ఓడిశా తీరానికి చేరుతోంది. 'రోను'గా నామకరణం చేసిన ఈ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను భయాందోళనలకు గురి చేసింది. నేటి ఉదయం కాకినాడకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో తిష్ఠ వేసుకుని కూర్చున్న ఈ తుపాను... తాజాగా దిశమార్చుకుంది. ఇప్పుడు ఒడిశాలోని గోపాల్ పూర్ దిశగా పయనిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు తప్పినట్టేనని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. మొదట్లో తమిళనాడు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ వాయుగుండం దిశ మార్చుకుని, నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి మీదుగా ఇప్పుడు ఒడిశా చేరుకుంది. దీని ధాటికి రుతుపవనాలు ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. తాజాగా పారాదీప్ కు 240 కిలోమీటర్ల దూరంలో గోపాల్ పూర్ కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీంతో తీరప్రాంతం మొత్తం వర్షాలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News