: హోదా రానే రాదన్నట్లు చంద్రబాబు మాట్లాడడం భావ్యమేనా?: సీఎంపై మండిపడ్డ బొత్స
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధినేత బొత్స సత్యనారాయణ మరోసారి మండిపడ్డారు. హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు హోదా రానే రాదన్నట్లు చంద్రబాబు మాట్లాడడం భావ్యమేనా..? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం హోదాపై ప్రకటన చేయకపోతే మేము చేసేదేముందని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గు చేటని ఆయన వ్యాఖ్యానించారు. మోదీతో చంద్రబాబు ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బొత్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎడారిగా మారిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ‘చంద్రబాబు స్వంత ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తున్నారు.. కానీ, రాష్ట్రప్రయోజనాల కోసం కాద’ని ఆయన విమర్శించారు.