: సికింద్రాబాద్ లో అదుపుతప్పిన సెట్విన్ బస్సు.. 30 మందికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
సికింద్రాబాద్‌లో ఓ సెట్విన్ బస్సు అదుపు తప్పి అక్కడి జనంపైకి దూసుకుపోవడంతో 30మంది గాయాలపాలయ్యారు. అక్కడి ఆర్పీరోడ్‌లో ఈరోజు ఉదయం ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే అదుపుతప్పిన సెట్విన్ బస్ ఆర్పీరోడ్ లో డివైడర్‌ను ఎక్కింది. దీంతో 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్ నుంచి దూకి డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.