: నీట్‌పై అత్యవసర ఆదేశాలు తీసుకురావద్దు, నల్లధనం పెరిగిపోతుంది: మోదీకి కేజ్రీ లేఖ
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)పై అత్యవసర ఆదేశాన్ని (ఆర్డినెన్స్) జారీ చేసే యోచనతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో కేంద్ర మంత్రి వర్గం భేటీ కావడం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. నీట్‌పై అత్యవసర ఆదేశాలు తీసుకురావద్దని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. పలు మెడికల్ కాలేజీలు భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. నీట్‌పై అత్యవసర ఆదేశాలు జారీ చేస్తే నల్లధనం కూడ బెట్టేవారికి సహకరించినట్లేనని కేజ్రీవాల్ లేఖలో అభిప్రాయపడ్డారు. చాలా మంది నేతలు, ఎంపీలకు మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.