: కర్నూల్ లో తుపాకి మిస్‌పైర్.. గన్‌మన్ పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. గన్‌మిస్ ఫైర్ కావడంతో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గాయపడ్డాడు. సుబ్రహ్మణ్యం ఆత్మకూరులోని బోధనం గ్రామ సర్పంచ్ మహేశ్వర్‌రెడ్డికి గన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తన వద్ద ఉన్న గన్ మిస్ ఫైర్ కావడంతో ఒక్కసారిగా సుబ్రహ్మణ్యం కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డాడని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుపాకీ మిస్‌ఫైర్ అంశంపై ఆరా తీస్తున్నారు.