: భూకంపాలతో ఈక్వెడార్‌లో భయం.. భయం.. మరోసారి కంపించిన భూమి
భూకంపాలతో ఈక్వెడార్ వణికిపోతోంది. వరస భూకంపాలతో అక్కడి జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. నెలరోజుల క్రితం అక్కడ సంభవించిన భారీ భూకంపంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. భారీ భూకంపం తరువాత కూడా అక్కడ పలుసార్లు భూమి కంపించడం అక్కడి ప్రజలను తేరుకోనివ్వకుండా చేసింది. తాజాగా మరోసారి 6.8 తీవ్రతతో ఈక్వెడార్ లో భూకంపం సంభవించింది. ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రాణ, ఆస్తి నష్టాల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప భయంతో అక్కడి పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చినట్లు ఆ దేశాధికారులు పేర్కొన్నారు.