: పుణ్యస్నానాలు చేసిన మూడుకోట్లమంది భక్తులు
అలహాబాదులో జరుగుతున్న మహాకుంభమేళాలో అపూర్వ ఘట్టం ముగిసింది. మౌని అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం భక్తుల 'హర హర గంగే' స్మరణతో స్నాన ఘట్టాలు మారుమోగాయి. ఆరువేల ఎకరాల్లో ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక నగరం ఇసుకవేస్తే రాలనంత మంది భక్తులతో నిండిపోయింది. తమ అంచనా ప్రకారం, ఒక్కరోజే మూడు కోట్ల మంది పవిత్ర గంగాస్నానం చేశారని కుంభమేళా నిర్వహణ అధికారి మణి ప్రసాద్ మిశ్రా తెలిపారు. నాగా సాధువులు, మహ మండలేశ్వరులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.