: ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదాయే లక్ష్యం... మ‌రో చ‌ర్చ‌నీయాంశంతో కేజ్రీవాల్ రెడీ


త‌మ‌ రాష్ట్రానికి సంబంధించిన మ‌రో బ‌ల‌మైన అంశాన్ని కేంద్రం ముందు చ‌ర్చ‌నీయాంశంగా ఉంచ‌డానికి ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ రెడీ అయ్యారు. సంపూర్ణ రాష్ట్ర ముసాయిదా బిల్లును కేజ్రీవాల్ ఈరోజు విడుద‌ల చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ త‌మ అధీనంలోనే జ‌ర‌గాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై తాను ప్రధాని మోదీ‌ స‌హా కేంద్ర మంత్రుల్ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాను క‌ల‌వ‌నున్న‌ట్లు కేజ్రీవాల్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. సంపూర్ణ రాష్ట్ర ముసాయిదా బిల్లును ఢిల్లీ ప్ర‌భుత్వం త‌మ వెబ్‌సైట్‌లోనూ ఉంచింది. జూన్ 30 వరకు ఈ బిల్లుపై సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్న‌ట్లు పేర్కొంది. జూన్ 30 తరువాత బిల్లుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడ‌తారు. రాష్ట్ర శాస‌న‌ సభ ఆమోదం త‌రువాత ఆ బిల్లును చట్ట సవరణ కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించ‌నున్నారు.

  • Loading...

More Telugu News