: గొగోయ్ గోల్ఫ్ ఆడుతుంటే, సోనోవల్ 'బాజీరావ్ మస్తానీ' చూశారు!


మరో 24 గంటల్లో ఒకరికి పదవి ఉంటుందో, ఊడుతుందో తేలిపోతుంది. మరొకరికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా? లేక కేంద్ర మంత్రిగానే కొనసాగాలా? అన్న విషయం తేలిపోతుంది. వారిద్దరే అసోంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు తరుణ్ గొగోయ్, సోనోవల్. ఇక వీరిద్దరూ ఫలితాల గురించిన టెన్షన్ ను వదిలేసి హాయిగా రిలాక్స్ అవుతున్నారు. గొగోయ్ తన కుటుంబీకులతో కలిసి థాయ్ ల్యాండ్ లో సేదదీరుతూ, గోల్ఫ్ ఆడుకుంటుండగా, సోనోవల్ మాత్రం సంజయ్ లీలా భన్సాలీ తాజా చిత్రం 'బాజీరావ్ మస్తానీ' సినిమా చూసి రిలాక్స్ అయ్యారు. కాగా, అసోంలో గత నెల 11వ తేదీన ఎన్నికలు ముగియగా, నెల రోజులుగా అటు నేతలు, ఇటు ప్రజలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అసోంలో బీజేపీ పాగా వేయనుందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News