: నడిరోడ్డుపై ఆగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... నడిరేయి నుంచి 50 మంది ప్రయాణికుల పడిగాపులు


తెలుగు నేలపై ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంలా మారుతోంది. నిర్లక్ష్యంగా బస్సులను నడుపుతున్న ఆయా ట్రావెల్స్ బస్సుల డ్రైవర్ల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇక కండిషన్ ను చూసుకోకుండానే ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు నిలిచిపోతున్నాయి. గంటల తరబడి కదలడానికి ఆ బస్సులు మొరాయిస్తున్నాయి. వెరసి నడి రేయిలోనూ ప్రయాణికులు నడిరోడ్డుపై గంటల తరబడి పడిగాపులు పడక తప్పడం లేదు. హైదరాబాదు నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 50 మంది ప్రయాణికులను ఎక్కించుకుని నిన్న రాత్రి బయలుదేరిన మేఘనా ట్రావెల్స్ బస్సు నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద నిలిచిపోయింది. బస్సులో నెలకొన్న సాంకేతిక లోపం కారణంగానే బస్సు నిలిచిపోయినట్లు డ్రైవర్ తేల్చేశాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు పిల్లా పాపలతో బస్సు దిగక తప్పలేదు. అర్ధరాత్రి బస్సు దిగి నడిరోడ్డుపై నిలిచిపోయిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో మేఘన ట్రావెల్స్ ఆసక్తి చూపలేదు. దీంతో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయం దాకా ప్రయాణికులంతా నడిరోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News