: కరవును ఎదుర్కొనేందుకు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం: చంద్రబాబునాయుడు
12 అంశాలతో కూడిన డిమాండ్లు ప్రధాని ముందు ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కరవు ఎదుర్కొనేందుకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలు నిర్దేశించుకున్నామని ఆయన చెప్పారు. గత పదేళల్లో భారత్ లో సంభవించిన తుపానులన్నింట్లో హుదూద్ పెద్దదని మోదీ చెప్పారని ఆయన తెలిపారు. అంత పెద్ద ఉత్పాతం నుంచి కోలుకున్న ఏపీ, కరవును సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు. కరవును ఎదుర్కొనేందుకు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. వర్షపు నీటిని ఆదా చేసుకోగలిగితే సగం నీటి ముప్పును ఎదుర్కోవచ్చని అన్నారు. నదుల అనుసంధానం జరగాలని ఆయన సూచించారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, మైక్రో ఇరిగేషన్ దిశగా దేశం నడవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిని మరింత పెంచుతూ పోవాలని ఆయన సూచించారు. మెట్టపంటలు పండించుకునేందుకు నీటిని ఆదాచేయాలని ఆయన సూచించారు. దీనిని ఉద్యమంగా చేపట్టనున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని నిర్ణయించామని ఆయన అన్నారు. ఈ విధానాల ద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువులు, పంట కుంటలు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. గ్రౌండ్ వాటర్ సోర్స్ ను పెంచుకుంటే నీటి నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. నదుల అనుసంధానం వల్ల 80 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి గోదావరిలోకి వదులుతామని ఆయన చెప్పారు. రియల్ టైమ్ వాటర్ మేనేజ్ మెంట్ సిస్టం ను రాష్ట్రానికి పరిచయం చేస్తామని ఆయన తెలిపారు.