: ‘బ్రహ్మోత్సవం’లో 100 కాస్ట్యూమ్స్ మార్చిన మహేష్
‘బ్రహ్మోత్సవం’ చిత్రం కోసం ప్రిన్స్ మహేష్ బాబు 100 కాస్ట్యూమ్స్ మార్చాడట. ఈ విషయాన్ని మహేష్ స్టైలిస్ట్ అక్షయ్ స్వయంగా పేర్కొన్నాడు. ఈ చిత్రంలో మహేష్ ను మరింత అందంగా, సింపుల్ లుక్ లో కనిపించేలా చూపించడానికి చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎంతో శ్రద్ధ తీసుకున్నారని చెప్పాడు. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని చిత్ర నిర్మాత పీవీపీ కూడా చెప్పినట్లు సమాచారం. సాధారణంగా అగ్ర హీరో సినిమాలో 25 కాస్ట్యూమ్స్ మార్చడమే చాలా ఎక్కువని, అటువంటిది మహేష్ ఇందులో 100 కాస్ట్యూమ్స్ వరకు మార్చడం విశేషమని అక్షయ్ పేర్కొన్నాడు.