: మందు తాగాక బ్రష్ చేయద్దంటున్న నిపుణులు!


ఫుల్లుగా మందు కొట్టాక ఆ వాసన రాకుండా కవర్ చేసేందుకు యాలక్కాయలో, లవంగాలో, వక్కపొడో, కిళ్లీ... ఇలా ఏదో ఒకటి నోట్లో పడేసి మేనేజ్ చేసి వారిని చూస్తూ ఉంటాం. అయితే, మరింతగా ఆలోచించి.. బ్రష్ చేస్తే మద్యం తాగిన వాసన అసలు రాకుండా ఉందనుకునేవారూ లేకపోలేదు. అయితే, పొరపాటున కూడా, ఈ పని చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, ఇలా బ్రష్ చేయడం వల్ల పళ్లపై ఎనామిల్ దెబ్బతిని పూర్తిగా దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయిట. మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుందని, తాగిన వెంటనే బ్రష్ చేసుకుంటే కనుక ఆ ఆమ్లంతో బ్రష్ చేసుకున్నట్లే అవుతుందన్నారు. పళ్లు త్వరగా పుచ్చిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News