: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఓ సైకో: గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు


భారతీయ జనతాపార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిపై గోవాకు చెందిన కాంగ్రెస్ నేత విరుచుకుపడ్డారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి ఓ సైకో అని గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు లుజిన్హో ఫలీరో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యసభలో సుబ్రహ్మణ్య స్వామి సైకోలా ప్రవర్తిస్తారని, తమ పార్టీ నేతలను అగస్టా కుంభకోణంలోకి లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అయితే, గోవా బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి పారికర్ పై వ్యాఖ్యలు చేసేందుకు లుజిన్హో ఫలీరో అంగీకరించలేదు. పార్టీ సిద్ధాంతాల పరంగా ఆయనతో విభేదాలున్నాయే తప్ప, ఆయనపై ఎటువంటి వ్యక్తిగత ద్వేషం తనకు లేదన్నారు.

  • Loading...

More Telugu News