: మహేష్ మంచి కథలు ఎంచుకోవడం వల్ల మాకు మంచి అవకాశాలు వస్తున్నాయి!: హీరోయిన్ సమంత
'బ్రహ్మోత్సవం' లాంటి సినిమా కథను ఎంచుకున్న మహేష్ బాబుకి పెద్ద థ్యాంక్స్ అని సమంత నవ్వుతూ చెప్పింది. మహేష్ బాబు మంచి కథలను ఎంచుకోవడం వల్లే తమకు మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. తాను మహేష్ బాబుతో చేసిన సినిమాలన్నీ భిన్నమైనవేనని గుర్తు చేసుకుంది. మహేష్ తో చేసిన సినిమాలు మరింత గుర్తింపును తీసుకొచ్చాయని సమంత చెప్పింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాను జడ్జ్ చేయడం చాలా కష్టమని, అయితే మహేష్ బాబు ఆ కథను ఎంచుకుని ధైర్యం చేస్తే, దానిని ప్రేక్షకులు ఆదరించి, మంచి విజయం అందించారని తెలిపింది. అంతకంటే బ్రహ్మోత్సవం ఇంకా బాగుంటుందని తెలిపింది. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం కల్పించిన మహేష్ కు, ఓ టీవీ ఇంటర్వ్యూలో సమంత ధన్యవాదాలు చెప్పింది.