: స్వామీజీల వాగ్యుద్ధం: విశాఖ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు.. ఏ-1గా జ్యోతిర్మయి భవానీ, ఏ-2గా రమణానంద మహర్షిపై ఎఫ్‌ఐఆర్‌


గత కొన్ని రోజులుగా టీవీలు, ఆధ్యాత్మిక స‌భల్లో చెల‌రేగుతోన్న స్వాముల ల‌డాయి తాజాగా మ‌రింత ముందుకు సాగింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవ‌ర‌కు వెళ్లింది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, సిద్ధగురు రమణానంద మహర్షి మ‌ధ్య చెల‌రేగిన గొడ‌వతో విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు న‌మోద‌యింది. శివశక్తిసాయి ఛాన‌ల్‌లో ప్ర‌సారమ‌వుతోన్న వార్త‌లు అభ్యంత‌రక‌రంగా ఉన్నాయంటూ చాగంటి సత్సంగ్‌ సభ్యులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈరోజు ఆరుగురిపై కేసు న‌మోదు చేశారు. దీనిలో ఏ-1గా జ్యోతిర్మయి భవానీ, ఏ-2గా రమణానంద మహర్షిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. శివశక్తిసాయి ఛాన‌ల్ ద్వారా భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారని చాగంటి సత్సంగ్‌ సభ్యులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రమణానంద మహర్షిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News