: వేదిక దిగిన వైఎస్ జగన్!


కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ, మూడు రోజుల జలదీక్షను ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి వేదిక దిగారు. ఆయన తన దైనందిన అవసరాల నిమిత్తం వేదికను వీడగా, కళాకారుల బృందాలు ప్రజలకు వీనులవిందుగా పాటలను వినిపిస్తున్నాయి. ఆ పార్టీ మహిళా నేతలు రోజా, బుట్టా రేణుక తదితరులు వేదిక ముందే కూర్చుని తమదైన కబుర్లలో మునిగిపోయారు. మరికాసేపట్లో జగన్ తిరిగి వేదికపైకి చేరుకుంటారని దీక్షా ప్రాంగణం మైకుల్లో వినిపిస్తోంది. జగన్ లేని దీక్షా ప్రాంగణం బోసిపోయినట్టు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News