: వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీ ఉప్పల సూరి పరారీ


వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీ ఉప్పల సూరి పరారవ్వడం కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా న్యాయస్ధానంలో సెంట్రల్ జైలు ఖైదీలను హాజరుపరిచిన అనంతరం రఘునాధపల్లి మండలం జనగామ సమీపంలో గతంలో తీవ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపిన భూపాలపల్లి ప్రాంతంలోకి రాగానే ఉప్పల సూరి తాము ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును ఆపాలని కోరాడు. మల విసర్జన చేయాలని కోరడంతో పోలీసులు బస్సును ఆపారు. దీంతో పొదల్లోకి వెళ్లిన సూరి ఎప్పటికీ తిరిగి రాలేదు. దీంతో పరారయ్యాడని గ్రహించిన పోలీసులు అటువైపు మూడు రౌండ్లు కాల్పులు జరిపినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో అదనపు బలగాలను రప్పించి, ఆ పరిసరాల్లో కూంబింగ్ చేపట్టారు.

  • Loading...

More Telugu News