: రాహుల్ కు జ్వరం...మోదీ ఆరా!
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ వాలిపోతున్న రాహుల్ గాంధీ మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ మౌనంగా ఉండడంతో అనుమానం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ కు ఏమైందని ఆరాతీశారు. దీంతో విషయం తెలుసుకున్న మోదీ రాహుల్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, వైరల్ ఫీవర్ కారణంగా గతవారం కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి పర్యటనను రాహుల్ గాంధీ వాయిదా వేసుకోగా, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.