: జగన్ దీక్షకు నిరసన... వైఎస్సార్సీపీ కార్యాలయ ముట్టడికి ఓయూ విద్యార్థుల యత్నం


కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న తాగునీటి ప్రాజెక్టులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ నిరాహార దీక్ష చేపట్టడంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలులో జగన్‌ చేస్తున్న దీక్షను నిరసిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ, తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన కార్యకర్తలు లోటస్ పాండ్ సమీపంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవద్దని, దొంగ దీక్షలు మొదలు పెడితే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News