: ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ స్టాలిన్ కుటుంబం


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేత స్టాలిన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్ఐఈటీ కాలేజీలో ఉన్న పోలింగ్ బూత్ కు స్టాలిన్ సహా ఆయన కుటుంబ సభ్యులు వెళ్లి తమ ఓట్లు వేశారు. అయితే, సాధారణ వ్యక్తుల్లాగా ఓటర్లతో కలిసి ఓపిగ్గా చాలా సేపు క్యూలో నిలబడ్డారు. కాగా, తమినాడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ జరిగిందని ఆరోపించిన స్టాలిన్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తంజావూర్, తదితర నియోజకవర్గాల్లో భారీ ఎత్తున డబ్బు పంపిణీ వ్యవహారంలో ముఖ్యమంత్రి జయలలిత పాత్ర ఉందంటూ స్టాలిన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News