: కేసీఆర్ హైదరాబాద్‌ని పట్టుకెళ్లారు, ఇప్పుడు నీళ్లనూ తీసుకెళుతున్నారు: జగన్
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కర్నూలులో చేపడుతోన్న దీక్షలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పై ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రవిభజన సమయంలో కేసీఆర్ హైదరాబాద్‌ని పట్టుకెళ్లారని, ఇప్పుడు నీళ్లనూ తీసుకెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విభజన చట్టంప్రకారం నడుచుకొనే కొత్తగా ప్రాజెక్ట్ లు కట్టాలని సూచించారు. ‘అసలే ఏపీలో నీళ్లులేని పరిస్థితున్నాయి. అటువంటప్పు మీరు కట్టే ప్రాజెక్టులు న్యాయమా..?' అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఏపీ ప్రజల ఉసురు కేసీఆర్ కు తగులుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ గా కలిసున్నప్పుడు తెలుగు ప్రజలంతా కలసి కర్ణాటక, మహారాష్ట్రలపై పోరాటం చేసే వాళ్లమని ఆయన అన్నారు. విడిపోయిన తరువాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు బాధేస్తోందని వ్యాఖ్యానించారు.