: నా ఒక్కడి వల్లా అయ్యే పనికాదు.. అందరూ కలసి రావాలి: జగన్


వ్యవస్థలో మార్పు వచ్చి, తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవాలంటే, తన ఒక్కడి వల్లా అయ్యే పనికాదని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం సైతం నష్టపోయేలా గోదావరి నదిపై ప్రాజెక్టులు కడుతున్నారని, దిగువ ప్రాంతానికి తాగు నీరు అందకుంటే ప్రజలు ఎలా బతకాలని ఆవేదనగా ప్రశ్నించిన జగన్, ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ నేతా కలసి వస్తేనే తెలంగాణ అక్రమ ప్రాజక్టులను అడ్డుకోగలమని అన్నారు. అందరం కలిసికట్టుగా ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. కేసీఆర్ అడ్డగోలుగా మాటలు మాట్లాడటం మానేయాలని హితవు పలికారు. గోదావరిలో కేటాయింపులను తప్పనిసరిగా పాటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి చుక్కనూ సాధించుకునేందుకు పోరాడుతామని జగన్ వివరించారు.

  • Loading...

More Telugu News