: కేసీఆర్ వెనక్కు తగ్గకుంటే ఏపీ-తెలంగాణలు ఇండియా-పాకిస్థాన్ అవుతాయి: జగన్ సంచలన వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కు తగ్గకుంటే, భవిష్యత్తులో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇండియా - పాకిస్థాన్ లా మారి తగవులాడుకునే ప్రమాదముందని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులతో సాగు నీటికి కాదు కదా... తాగు నీరు కూడా అందే పరిస్థితులు ఉండవని, అప్పుడు ప్రజలు ఉద్యమిస్తే ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. కర్నూలులో జలదీక్షకు వచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ వైఖరిని, ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ కాళ్ల కింద తాకట్టు పెట్టిన చంద్రబాబుకు ప్రజల ఉసురు తగిలే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని కేసీఆర్ కు హితవు పలికారు. ఒకవేళ ఆంధ్రరాష్ట్రం పైన ఉండి, తెలంగాణ కింద ఉండి, ఆంధ్రా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, కేసీఆర్ ప్రశ్నించరా? అని అడిగారు.