: ఖాకీలపై తెలుగు యువత నేత పిడిగుద్దులు!... అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు


ఏపీలో అధికార టీడీపీ యువజన విభాగం తెలుగు యువతకు చెందిన ఓ నేత పోలీసులపై ప్రతాపం చూపారు. సొంత పార్టీకి చెందిన ఓ నేతపై తన దాడిని అడ్డుకోవడమే పోలీసులు చేసిన నేరంగా పరిగణించిన ఆ నేత... ఖాకీలని కూడా చూడకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. వివరాల్లోకెళితేే... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పాకాల మండలం తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిశోర్ నాయుడు, పాకాల ఎంపీటీసీ గౌతమి భర్త రమేశ్ లు తమ అనుచరులతో కలిసి... ఎంపీపీ చాముండేశ్వరి అనుచరులపై దాడికి దిగారు. దీనిని గమనించిన పాకాల పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైలుగా పనిచేస్తున్న రవీంద్రనాథ్, శ్యామ్ బాబు, కానిస్టేబుల్ హనీఫ్ బాషా గొడవను అదుపు చేసేందుకు వచ్చారు. దీంతో తమనే అడ్డుకుంటారా? అంటూ కిశోర్ నాయుడు, రమేశ్ లు ఇద్దరు ఏఎస్సైలు, కానిస్టేబుళ్లపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఘర్షణను రికార్డు చేసేందుకు పోలీసులు వినియోగించిన ట్యాబ్, సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు. కిశోర్ నాయుడు దౌర్జన్యంపై కానిస్టేబుల్ హనీఫ్ బాషా చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పాకాల పోలీసులు కిశోర్ నాయుడు, రమేశ్ లు సహా మొత్తం ఆరుగురిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. ఆ తర్వాత నిందితుల కోసం వేట సాగించిన పోలీసులు నిన్న కిశోర్ నాయుడు, రమేశ్ లను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News