: పోలీసులు అడ్డుకోవడంతో కారు దిగి రోడ్డెక్కిన హీరోయిన్ అదితి రావు!
ఓ కార్యక్రమానికి వెళ్లాలన్న తొందరలో రాంగ్ రూట్ లో వెళ్తున్న హీరోయిన్ అదితి రావుకు చుక్కెదురైంది. ఆమె కారును పోలీసులు నిలువరించడంతో, చేసేదేమీ లేక ఢిల్లీ వీధుల్లో నడిచుకుంటూ వెళ్లింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నోయిడా ప్రాంతంలోని సెక్టార్ 18లో ఓ కొత్త మాల్ ఇటీవల ప్రారంభమైంది. ఇక్కడ జరుగుతున్న ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారులో బయలుదేరింది. సమయం మించిపోతుండటంతో, ఆమె కారును నడుపుతున్న డ్రైవర్ రాంగ్ రూట్ లోకి వెళ్లాడు. దాంతో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్, కారును అడ్డగించి ముందుకు కదలనీయలేదు. మాల్ యాజమాన్యం కల్పించుకున్నా వినలేదు. వెనుక వచ్చిన అదితి రావు సహాయక సిబ్బంది కాస్త హడావుడి చేసినా తన పని చేసుకుపోయాడు ధర్మేంద్ర. దీంతో ఇక లాభం లేదనుకున్న అదితి, కారు దిగి, తన కాలికి పని చెప్పింది. నడుచుకుంటూ, మాల్ దగ్గరికి వెళ్లిపోయింది.