: కొత్తపల్లి సుబ్బారాయుడు స్థానంలో ఆళ్ల నానికి ఛాన్సిచ్చిన జగన్


పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆళ్ల నానిని నియమిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. నాని నేతృత్వంలో పశ్చిమ గోదావరిలో వైకాపా మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీనీ వైకాపా గెలుచుకోలేకపోయిన జిల్లాగా పశ్చిమ గోదావరి నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో నాని నియామకానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News