: అరెస్ట్ చేయనంటే వచ్చేస్తా!... రుణాలను చెల్లిస్తా!: విజయ్ మాల్యా కొత్త ఆఫర్!


డిఫాల్టర్ గా ముద్ర వేయించుకుని విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నుంచి మరో కొత్త ప్రతిపాదన వచ్చింది. మొత్తం 17 బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలను చెల్లించేందుకు సిద్ధమేనని ప్రకటించిన ఆయన దేశానికి తిరిగి వచ్చేందుకు మాత్రం కొన్ని కండిషన్లు పెట్టారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ నేటి తన సంచికలో ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. శుక్రవారం ముంబైలో జరిగిన యునైటెడ్ బ్రూవరీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి మాల్యా కూడా హాజరయ్యారు. లండన్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరు సమావేశానికి హాజరై కీలక ప్రకటన చేశారు. రుణాలు చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన మాల్యా... తనను అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో పాటు తనకు రక్షణ కల్పిస్తామన్న హామీ లభిస్తే భారత్ కు వచ్చేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. ఈ మేరకు కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న కిరణ్ మజుందార్ షాను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News