: వైఎస్ జగన్ జలదీక్షకు సర్వం సిద్ధం!... మూడు రోజుల పాటు దీక్ష చేయనున్న వైసీపీ అధినేత


కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కొత్త ప్రాజెక్టులకు నిరసనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు జలదీక్ష పేరిట మూడు రోజుల నిరసనకు దిగనున్నారు. రాయలసీమ ముఖద్వారంగా ఉన్న కర్నూలులో నేడు మొదలుకానున్న ఈ దీక్ష మూడు రోజుల పాటు కొనసాగనుంది. కర్నూలు శివారులోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఈ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మరికాసేపట్లో కర్నూలు చేరుకోనున్న జగన్... డోన్ రోడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి నగరం మొత్తాన్ని చుట్టేస్తూ దీక్షా స్థలికి చేరుకోనున్నారు. వైఎస్ జల దీక్షకు పెద్ద సంఖ్యలో జనం తరలిరానున్న దృష్ట్యా పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News