: యువకులం ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో నిలబడ్డాం... ఫలితం సంతోషాన్నిచ్చింది: విశాల్


తమిళ, తెలుగు సినిమాల్లోని యువ నటులందరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని విశాల్ చెప్పాడు. 'రాయుడు' సినిమా ప్రమోషన్ లో విశాల్ మాట్లాడుతూ, సమాజానికి ప్రతి ఒక్కరం ఎంతో కొంత సేవచేయాలని తామంతా నమ్ముతామని అన్నాడు. అందుకే నడిగర సంఘం భవనంపై పలు కథనాలు విని, భవిష్యత్ లో అలాంటి కథలు వినకూడదని నిర్ణయించుకున్నామని, అయితే ఎవరో ఒకరు ముందుకు నడవాలని సూచించడంతో ఆ బాధ్యతను తాను, కార్తీ తీసుకున్నామని విశాల్ చెప్పాడు. నడిగరసంఘం ఎన్నికల కోసం పడ్డ కష్టాన్ని మర్చిపోలేమని అన్నాడు. ఆ సమయంలో ఓ సినిమా చేసి ఉంటే బోలెడు డబ్బులు వచ్చి ఉండేవని అన్నాడు. అయితే అంతిమంగా ఫలితం చూసుకున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ పటాపంచలయ్యాయని తెలిపాడు. తమ వెనుక అంత మంది నిలబడ్డారన్న ఆనందం అన్ని భావాలను మరుగుపరచిందని, సంతోషం మాత్రమే నిలిచిందని విశాల్ తెలిపాడు. సినీ నటులంతా కాలేజీ ఫ్రెండ్స్ లా కలుసుకుని సంతోషంగా గడుపుతామని విశాల్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News