: హైదరాబాదులో నేటి అర్ధ రాత్రి నుంచి ఆగిపోనున్న ఆటోలు


నేటి అర్ధరాత్రి నుంచి హైదరాబాదులో ఆటోలు నిలిచిపోనున్నాయి. రవాణా శాఖాధికారులు, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిరసనగా నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నామని తెలంగాణ ఆటో రిక్షాల డ్రైవర్ల జేఏసీ ప్రకటించింది. మే 16 నుంచి హైదరాబాదులో పోలీసులు, ఆర్టీఏ అధికారులు చేపట్టనున్న స్పెషల్ డ్రైవ్ ను వాయిదా వేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికులను అడ్డగోలుగా దోచుకుంటూ, నచ్చిన ధరలు నిర్ణయించి ట్రిప్పులు వేస్తున్నా వారిని ఏమీ అనడం లేదని, ఆటో డ్రైవర్లపై మాత్రం అధికారులు వేధింపులకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల జీవనం సంక్షోభంలో పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ డ్రైవ్ సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన డ్రైవర్ల పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News