: రైతులతో కలిసి బస్సెక్కిన పరిటాల!... హంద్రీ-నీవాపై అవగాహనకు టీచర్ అవతారం ఎత్తిన మహిళా మంత్రి


టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కొద్దిసేపటి క్రితం తన కారును వదిలేసి బస్సెక్కారు. నిండా రైతులతో ఉన్న ఆ బస్సులో తన సీటులో కూర్చుని డ్రైవర్ కు రైట్ చెప్పేసిన ఆమె... వెనువెంటనే మంత్రి పదవిని తాత్కాలికంగా పక్కన పెట్టేసి టీచర్ అవతారం ఎత్తారు. వివరాల్లోకెళితే.. కరవు జిల్లా అనంతపురం జిల్లాలో సాగు, తాగు నీటి కోసం ప్రభుత్వం చేపట్టిన హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం దాదాపుగా పూర్తి కావస్తోంది. అసలు ఈ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీరు వస్తుంది, ఎక్కడ నిల్వ చేసుకోవాలి, ఏఏ ప్రాంతాలకు ఈ పథకం నుంచి నీరు సరఫరా అవుతుందన్న విషయాలపై జిల్లా రైతాంగానికి అంతగా అవగాహన లేదు. ఇదే విషయాన్ని గమనించిన మంత్రి పరిటాల... వినూత్న పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన రైతులను అనంతపురం రప్పించిన ఆమె అక్కడ అప్పటికే సిద్ధంగా ఉంచిన బస్సెక్కించారు. తాను కూడా వారితో పాటు బస్సెక్కారు. బస్సును హంద్రీ-నీవా ప్రాజెక్టు వెంట తీసుకెళ్లమని డ్రైవర్ కు చెప్పిన సునీత... ఆయా ప్రాంతాల్లో బస్సును ఆపి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రైతులకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ యాత్ర నేటి సాయంత్రం దాకా కొనసాగుతుదని సమాచారం.

  • Loading...

More Telugu News