: ‘గుంటూరు’ బాధిత కుటుంబాలకు వైసీపీ బాసట!... రూ.50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన బొత్స


బాధితులను ఆదుకునే విషయంలో ఏపీలో అధికార టీడీపీతో విపక్ష వైసీపీ పోటీ పడుతోంది. గుంటూరులోని లక్ష్మీపురంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల పరిహారాన్ని మంత్రి రావెల కిశోర్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సదరు పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని బాధిత కుటుంబాలకు చెందిన వారు మృతదేహాలతో నగరంలోని జీజీహెచ్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే అక్కడ ప్రత్యక్షమైన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన ఆయన రెండో రోజుల్లో జగన్ కూడా పరామర్శకు రానున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News