: రోడ్డెక్కిన ‘గుంటూరు’ బాధిత కుటుంబాలు... తక్షణ పరిహారం, బాధ్యులపై చర్యలకు డిమాండ్


గుంటూరులోని లక్ష్మీపురంలో నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి బంధువులు రోడ్డెక్కారు. నేటి ఉదయం మృతదేహాలకు నగరంలోని జీజీహెచ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలను తీసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు రూ.20 లక్షల పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బాధితులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతేకాక ఘటనకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు పలు ప్రజా సంఘాలు, వామపక్షాల నేతలు మద్దతు పలకడంతో అక్కడ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.

  • Loading...

More Telugu News