: మరికాసేపట్లో టీఎస్ ఎంసెట్!... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!


ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నేటి ఉదయం ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షను నిర్వహించనున్న ప్రభుత్వం మధ్యాహ్నం మెడికల్ ప్రవేశాల పరీక్షను నిర్వహించనుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ‘క్యూ’ క్వొచ్చన్ పేపర్ ను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే, గతంలో మాదిరే ఈ ఏడాది కూడా నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లభించదు. నిర్దేశిత సమయం కంటే గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ప్రకటించారు. ఇక విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లను పకడ్బందీగా చేశామని కడియం వెల్లడించారు.

  • Loading...

More Telugu News