: శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం...ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం సంభవించింది. కవిటి, కంచిలి మండలాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సుమారు మూడు సెకెన్ల పాటు భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు కిందపడ్డాయి. పలు సామాన్లు స్థాన చలనం జరిగాయి. ఇళ్లు ఊగిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తరువాత భూకంపం అని తెలుసుకుని ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకపోవడం విశేషం.