: హోదాపై ఈనెల 17న మోదీతో చంద్రబాబు చర్చిస్తారు: మంత్రి యనమల
ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువవుతోన్న వేళ రాష్ట్ర మంత్రులందరూ ఆ విషయంపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 17వ తేదీన మోదీతో చంద్రబాబు సమావేశమై హోదా అంశాన్ని ప్రస్తావిస్తారని ఆయన తెలిపారు. హోదాపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, చంద్రబాబు ప్రత్యేక హోదాపై కేంద్రంతో ప్రస్తావించలేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీతో బీజేపీకి వున్న స్నేహాన్ని దూరం చేయాలని కొందరు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా, నిధులపై తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, కేంద్రం స్పందిస్తోందని తెలిపారు.